హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గడువు పూర్తైన కంటైన్మెంట్ జోన్లను తొలగించాలని అధికారులకు సూచించారు. దీనికి ఆమోదం తెలిపిన అధికారులు 6 జోన్లను ఫ్రీ జోన్లుగా ప్రకటించారు.
పాతబస్తీలో 6 కంటైన్మెంట్ జోన్ల ఎత్తివేత - mla akbaruddin owaisi in old city
హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని 7 కంటైన్మెంట్ జోన్లలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పర్యటించారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న 180 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు.
పాతబస్తీలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పర్యటన
కంటైన్మెంట్లో ఉన్న 180 కుటుంబాలకు జీహెచ్ఎంసీ దక్షిణ మండల జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్‌తో కలిసి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు.