మహిళలను మోసం చేసిన సైబర్ నేరగాళ్ల అరెస్టు!
మనీ సర్క్యులేషన్ స్కీమ్ పేరుతో మహిళలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్‌కి చెందిన ముగ్గురు మహిళలను మోసం చేసిన సుబోత్, అతడి స్నేహితులను పోలీసులు అరెస్టు చేసి.. కేసు నమోదు చేశారు.
మనీ సర్క్యులేషన్ స్కీమ్ పేరుతో మహిళలను మోసం చేస్తున్న నలుగురు యువకులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. స్కీములో పెట్టుబడి పేడితే.. లక్షల్లో డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపి.. రూ.15 లక్షలు వసూలు చేశారు. మియాపూర్‌కి చెందిన సుబోత్ అతని స్నేహితులు దీక్షిత్, ఉదయ్, జీవన్, రాహుల్ మలాని కలిసి ఒక మహిళను ట్రాప్ చేసి డబ్బులు కాజేయడమే కాకుండా.. వేధింపులకు గురి చేసి.. అసభ్యంగా ప్రవర్తించారని సదరు బాధితురాలు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతులను అరెస్టు చేశారు. డబ్బులకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచించారు.