మిథునం ఒక్క సినిమాతో... నాలుగు నంది అవార్డులు పొందిన గొప్పనటుడు ఎస్పీ బాలు అని ఆ చిత్ర నిర్మాత ఎం.ఆనందరావు తెలిపారు. మిథునం-2 సినిమా కోసం మాట్లాడిన కొద్దీ రోజులకే ఇలా జరగడం దురదృష్టమని ఆయన బాధపడ్డారు. బాలు.. పసిబాలుడని, ఆయన మనస్తత్వం చిన్నపిల్లాడిలా ఉంటుందని చెప్పుకొచ్చారు. మిథునం చిత్ర సమయంలో చాలా ఆత్మీయ అనుబంధం ఏర్పడిందన్నారు. ఎంత పనిలో ఉన్న ఆత్మీయులకు విలువనిచ్చే వారన్నారు.
తమ్ముడు అని ఆత్మీయంగా పిలిచేవారు : మిథునం నిర్మాత - ఎస్పీ బాలు మృతి వార్తలు
ఎస్పీ బాలు పసిబాలుడని, ఆత్మీయులకు ఆయన ఎంతో విలువ ఇచ్చేవారని మిథునం సినిమా నిర్మాత ఎం.ఆనందరావు అన్నారు. బాలు గానమాధుర్యం ఎన్నటికీ మరువలేనిదని చెప్పారు. తనను తమ్ముడు అని ప్రేమగా పిలిచేవారని ఆయన గత స్మృతులను గుర్తుచేసుకున్నారు.
తమ్ముడు అని ఆత్మీయంగా పిలిచేవారు : మిథునం నిర్మాత
బాలు గాన మాధుర్యం ఎప్పటికీ మరువలేనిదని ఆనందరావు చెప్పారు. బాలు.. వారి గురువు ఘంటసాల పట్ల అమితమైన ప్రేమ చూపేవారన్నారు. మిథునం సినిమా సమయంలో ఎంతో ఆత్మీయత ఏర్పడిందని.. తమ్ముడు అని ప్రేమగా పిలిచే బాలు లేకపోవడం బాధగా ఉందని ఆనందరావు ఆవేదన చెందారు.
ఇదీ చదవండి :దివికేగిన గానగంధర్వుడు- ఎస్పీ బాలు అస్తమయం