సికింద్రాబాద్లోని కార్ఖానాలో గ్రీన్ 9 హోటల్లో మంచి కలలు సంస్థ ఆధ్వర్యంలో అనాథ పిల్లలతో కలిసి భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ భోజనం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ షికా గోయల్ హాజరయ్యారు. పిల్లలతో కలిసి భోజనం చేస్తూ వారికి మేమున్నామంటూ భరోసానిచ్చారు. వారితో ఇలా విందారగించడం సంతృప్తినిచ్చిందని అన్నారు.
పిల్లలతో కలిసి భోజనం చేసిన మిథాలీ రాజ్ సమాజసేవ చేయడం ఇష్టం
సమాజ సేవ చేయడం తనకు ఎంతో ఇష్టమని మిథాలీ రాజ్ అన్నారు. అనాథ పిల్లలకు ఎవరూ లేరనే భావనను పారద్రోలేందుకు ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో వృద్ధులు వికలాంగులకు సంబంధించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఇదీ చూడండి : హిమక్రీమ్.. కొత్త రుచులతో మరింత మధురం