తెలంగాణ

telangana

By

Published : Nov 2, 2020, 11:23 PM IST

ETV Bharat / state

మిషన్ సాగర్-2: సూడాన్​కు సహాయ సామగ్రిని మోసుకెళ్లిన ఐరావత్

భారత నౌకాదళానికి చెందిన ఐరావత్ నౌక సూడాన్ చేరుకుంది. 'మిషన్ సాగర్-2' పేరుతో కరోనా వేళ మిత్ర దేశాలకు భారత్ సాయం చేస్తోంది. ఇందులో భాగంగానే సూడాన్​కు మందులు, ఆహార సామగ్రిని పంపించింది.

మిషన్ సాగర్-2: సూడాన్​కు సహాయ సామగ్రిని మోసుకెళ్లిన ఐరావత్
మిషన్ సాగర్-2: సూడాన్​కు సహాయ సామగ్రిని మోసుకెళ్లిన ఐరావత్

'మిషన్ సాగర్-2' భాగంగా భారత నేవీకి చెందిన నౌక ఐరావత్ ప్రకృతి వైపరీత్య సహాయ సామగ్రితో సోమవారం సూడాన్ చేరుకుంది. కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న వేళ సూడాన్​కి సాయం అందించేందుకు భారత్ కార్యాచరణ అమలు చేస్తోంది.

'మిషన్ సాగర్'ను మే, జూన్ నెలల్లో అమలు చేసిన భారత్... మాల్దీవులు, మారిషస్, సియాచెల్స్, మడగాస్కర్, కొమోరోస్ వంటి దేశాలకు మందులు, ఆహార సామగ్రిని సరఫరా చేసింది. ఇప్పుడు 'మిషన్ సాగర్-2' భాగంగా సూడాన్, దక్షిణ సూడాన్, దిజ్బోటి, ఎరిత్రియాలకు సాయం అందిస్తోంది. పొరుగు దేశాలతో స్నేహ బంధాన్ని పటిష్టం చేసుకునే చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాలను భారత్ అమలు చేస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటుగా వివిధ సహాయ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ భారత నౌకాదళం ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది.

మందులు, ఆహార సామగ్రి

ఇదీ చదవండి: నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్​

ABOUT THE AUTHOR

...view details