ప్రతి గ్రామంలో జనవరి నాటికి మిషన్ భగీరథ అంతర్గత పనులు పూర్తి చేయాలని ఈఎన్సీ కృపాకర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల ఎస్ఈ, ఈఈలతో ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. మిషన్ భగీరథ నీటి వినియోగంపై ప్రజలను మరింత చైతన్యం చేయాలన్న ఆయన, స్థిరీకరణ పనుల్లో భాగంగా పాత ఓవర్ హెడ్ ట్యాంక్‌లకు అవసరమైన మరమ్మత్తులు చేసి నీటి సరాఫరాకు ఉపయోగించాలని స్పష్టం చేశారు.
"జనవరి నాటికి భగీరథ పనులు పూర్తిచేయాలి" - The mission of Bhagirathha is to complete the internal work of all villages by January
జనవరి నాటికి మిషన్ భగీరథ అంతర్గత స్థిరీకరణ పనులు పూర్తి కావాలని ఈఎన్సీ కృపాకర్ రెడ్డి తెలిపారు. అన్ని జిల్లాల ఎస్ఈ, ఈఈలతో ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయం నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

పాత, కొత్త ఓవర్ హెడ్ ట్యాంక్‌ల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కృపాకర్ రెడ్డి చెప్పారు. గ్రామంలోని ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ ఉండేలా చూడాలని, ఇప్పటికే భగీరథ నీరు సరాఫరా అవుతున్న గ్రామాల్లోని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులను ఈ పనుల్లో భాగం చేయాలని పేర్కొన్నారు. భగీరథ నీటి నాణ్యతపై స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామాల్లో పర్యటించి భగీరథ నీటి సరాఫరా తీరును పరిశీలించాలని ఇంజినీర్లను ఆదేశించారు.
ఇదీ చూడండి : ' దీక్ష భూమి వరకు అంబేడ్కర్ సమతా యాత్ర'