తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇదెక్కడి సమస్య.... ట్యాంకు కట్టారని సంతోషపడాలా.. నిర్లక్ష్యం చూసి బాధపడాలా! - మిషన్​ భగీరథ అధికారుల నిర్లక్షం

తమ కాలనీలో వాటర్​ ట్యాంకు నిర్మిస్తున్నప్పుడు అందరూ ఆనందం వ్యక్తం చేశారు. తమ నీటి కష్టాలు తీరిపోనుందని సంబరపడ్డారు. నిర్మాణం పూర్తై ట్యాంకు నీటి నింపుతున్నప్పుడు సంతోషానికి అవధుల్లేవు.. వాళ్ల సంతోషం చూసి అధికారులు అసలు విషయం మరచిపోయారో ఏంటో... మోటార్ ఆఫ్ చేయలేదు. ఇంకేముంది గొంతు తడపాల్సిన నీరు కాస్తా ట్యాంకు నుంచి పొంగి పొర్లి ఇళ్లను ముంచెత్తింది.

water tank over flow
ఇదెక్కడి సమస్య

By

Published : Feb 14, 2020, 11:06 PM IST

Updated : Feb 14, 2020, 11:32 PM IST

నీటి పారుదల శాఖ నిర్లక్షం ఆ కాలనీ వాసుల గూడును ముంచింది. నీళ్ల ట్యాంకుకు నీటిని నింపుతున్న అధికారులు ట్యాంకు నిండిన తర్వాత మోటార్​ ఆపకపోవడం వల్ల నీరు బయటకొచ్చి ఇళ్లను ముంచెత్తిన ఘటన హైదరాబాద్​ శివారు జల్​పల్లి మున్సిపాలిటీ పరిధి శ్రీరామ్​నగర్​ కాలనీలో జరిగింది.

కాలనీలో మిషన్​ భగీరథ పథకం కింద నూతనంగా నిర్మించిన నీళ్ల ట్యాంకును ఇవాళ పరీక్షించారు. ఈ క్రమంలో నీటిని విడిచిపెట్టిన అధికారులు ట్యాంకు నిండినా మోటార్​ ఆపడం మరిచిపోయారు. ట్యాంకు నిండి నీరంతా కాలనీలో ఇళ్లలోకి చేరింది. ట్యాంకు నిర్మించారని సంతోషపడాలో... అధికారుల నిర్లక్ష్యానికి బాధపడాలో తెలియని పరిస్థితి కాలనీవాసులది. ట్యాంకు నిర్మాణంలోనూ నాణ్యత లోపించిందని స్థానికులు అంటున్నారు.

ఇదెక్కడి సమస్య

ఇదీ చూడండి: భవననిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతివ్వాలి: కేటీఆర్

Last Updated : Feb 14, 2020, 11:32 PM IST

ABOUT THE AUTHOR

...view details