మిషన్ భగీరథ పుట్టిందే కమీషన్ కోసమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు రూ.100 కోట్లకు మించితే గ్లోబల్ టెండర్లు పిలవాలని కానీ తెరాస ప్రభుత్వం రూ.4వేల కోట్ల పనులను నామినేషన్ ద్వారా ఇచ్చిందన్నారు. భాజపా ఇప్పటికైనా తెరాస అవినీతి గురించి మాట్లాడటం సంతోషమన్నారు. పాలన గాడి తప్పిందని కలెక్టర్ల సదస్సులో స్వయంగా సీఎం ఒప్పుకున్నారని జీవన్‌రెడ్డి గుర్తు చేశారు. అవినీతిని తగ్గించేందుకు కొత్త రెవెన్యూ చట్టం అంటున్నారని... అంటే ఇప్పటివరకు అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్లే కదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం డీపీఆర్‌ను కేంద్రానికి పంపి ఉంటే రూ.60 వేల కోట్ల సాయం అందేదని జీవన్ రెడ్డి చెప్పారు.
కమీషన్ కోసమే మిషన్ భగీరథ: జీవన్‌రెడ్డి - jeevan reddy
కమీషన్ల కోసమే మిషన్ భగీరథ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. పాలన గాడి తప్పిందని కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ ఒప్పుకున్నారని తెలిపారు.
జీవన్ రెడ్డి