తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్ భగీరథ ఇంజినీర్లకు ఎర్రమంజిల్​లో వర్క్​షాప్ - Mission_Bhageeratha_Workshop

ద ఇంటర్నేషనల్‌ సెంటర్ ఫర్‌ అల్టర్నేటివ్‌ డిస్ప్యూట్‌ రిసోల్యూషన్‌ ఆధ్వర్యంలో మిషన్​ భగీరథ ఇంజినీర్లకు ఎర్రమంజిల్​లో వర్క్​షాప్​ను నిర్వహించారు. వారికి జ్యూడిషియల్ వ్యవస్థపై పట్టు పెరుగుతోందని ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌ కృపాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ వర్క్​షాప్​ల ద్వారా వివాదాలు జరగకుండా చూడవచ్చునని పేర్కొన్నారు.

మిషన్ భగీరథ ఇంజినీర్లకు ఎర్రమంజిల్​లో వర్క్​షాప్

By

Published : Aug 19, 2019, 3:24 PM IST

మిషన్ భగీరథ ఇంజినీర్లకు వర్క్‌షాప్‌లు చాల ఉపయోగపడుతాయని మిషన్ భగీరథ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌ కృపాకర్ రెడ్డి వెల్లడించారు. ఇంజినీర్లకు టెక్నాలజీ తెలుసు కానీ జ్యూడిషియల్ వ్యవస్థ గురించి తెలియదని పేర్కొన్నారు. కాబట్టి ఈ వర్క్‌షాప్‌లు దోహదపడుతాయన్నారు. ద ఇంటర్నేషనల్‌ సెంటర్ ఫర్‌ అల్టర్నేటివ్‌ డిస్ప్యూట్‌ రిసోల్యూషన్‌ ఆధ్వర్యంలో ఎర్రమంజిల్‌లోని ఆర్​డబ్ల్యూఎస్ కార్యాలయంలో రెండు రోజులపాటు వర్క్​షాప్​ను నిర్వహించారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో ఏమైనా వివాదాలు ఉంటే కోర్టుకు వెళ్లకుండానే పరిష్కారం చేసుకోవచ్చునని తెలిపారు. కాంట్రాక్టు వ్యవస్థలో రోజు రోజుకూ వచ్చే మార్పులు లీగల్ ఇష్యూలు ఏమైనా ఉంటే వివాదాలు పరిష్కారించుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఇన్​ఛార్జీ కార్యదర్శి జేఎల్​ఎన్ మూర్తి, చీఫ్‌ ఇంజినీర్ వినోభా దేవితోపాటు పలువురు ఇంజినీర్లు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ ఇంజినీర్లకు ఎర్రమంజిల్​లో వర్క్​షాప్

ABOUT THE AUTHOR

...view details