రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలకూ మిషన్ భగీరథ నీరు అందిస్తున్నామని ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ వెల్లడించారు. ఈ నెలాఖరుకు అన్ని మారుమూల ప్రాంతాలకు నీరందివ్వడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో సీఈ, ఎస్ఈలతో సమీక్షా సమావేశం నిర్వహించారామె.
జనవరికల్లా మారుమూల ప్రాంతాలకూ నీరందించాలి : స్మిత - మారుమూల ప్రాంతాలకు మిషన్ భగీరథ అందించాలంటూ స్మితా ఆదేశం
ఏడాది చివరి నాటికి మారుమూల ప్రాంతాలకూ మిషన్ భగీరథ నీళ్లందించాలని సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల సీఈ, ఎస్ఈలతో హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ప్రధాన కార్యాలయంలో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
అంగన్వాడీలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, రైతువేదికలు, వైకుంఠ ధామాలు, వైద్య సంస్థలకు నీటి సదుపాయం కల్పించాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనుకున్న పరిమాణం కంటే ఎక్కువగా తాగునీరు అందిస్తున్నామని, నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. వందశాతం స్థిరీకరణ సాధించిన అధికారులకు ప్రోత్సహకాలు అందిస్తామని ఆమె తెలిపారు. జనవరిలో నిర్వహించే సమావేశం నాటికి లక్ష్యం పూర్తి కావాలన్నారు. మిషన్ భగీరథలో నిర్మించిన కట్టడాలు, పంపుసెట్లు, పైపులైన్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.