తెలంగాణ

telangana

'మినరల్ వాటర్​ కన్న... మిషన్ భగీరథ నీళ్లు మిన్న'

తాగు నీటిరంగ నిపుణులు పాండురంగారావు ఆధ్వర్యంలోని ఇంజనీర్లు మిషన్ భగీరథ, మినరల్-ఆర్వో నీటిపై చేసిన పరిశోధన జరిపారు. తాగేంగదుకు మిషన్ భగీరథ నీరే శ్రేష్ఠమని తేల్చారు.

By

Published : Mar 5, 2020, 12:30 PM IST

Published : Mar 5, 2020, 12:30 PM IST

వినోద్ కుమార్​కు నివేదిక అందజేసిన పాండు రంగారావు
వినోద్ కుమార్​కు నివేదిక అందజేసిన పాండు రంగారావు

మినరల్ -ఆర్వో నీటి కన్నా... మిషన్ భగీరథ నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వరంగల్ నిట్ విశ్రాంత ప్రొఫెసర్ పాండురంగారావు అన్నారు. పాండురంగారావు ఆధ్వర్యంలోని నిపుణులు, ఇంజనీర్లు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మిషన్ భగీరథ, మినరల్ -ఆర్వో నీటిని పరీక్షించారు. మినరల్-ఆర్వో నీరు ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని తమ అధ్యయనంలో తేలినట్లు వారు వెల్లడించారు. ఈ నీటిలో 100 పీపీఎం లోపు మినరల్స్ ఉండగా... మిషన్ భగీరథ నీరులో 300 నుంచి 400 పీపీఎం మినరల్స్ ఉన్నట్లు నివేదికలో తేలిందన్నారు.

ఆ నీరు తాగితే డిప్రెషన్,హెయిర్ లాస్..

పాండురంగారావు ఆధ్వర్యంలోని బృందం మిషన్ భగీరథపై తయారు చేసిన నివేదికను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్​కు అందించారు. మిషన్ భగీరథ నీళ్లలో మినరల్స్, కాల్షియం, మ్యాగ్నీషియం, పుష్కలంగా లభిస్తాయని పాండురంగారావు తెలిపారు. మిషన్ భగీరథ నీళ్లు ఆరోగ్యకరమైనవని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నివేదిక వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు.

మినరల్-ఆర్వో నీటిని తాగుతూ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఆర్వో నీటిని శుద్ధి చేయడం వల్ల మినరల్స్ నశించిపోతున్నాయన్నారు. ఈ నీరు తీసుకోవడం వల్ల ఎముకలు మెత్తబడటం, కీళ్ల నొప్పులు, బోన్ లాస్, వెంట్రుకలు ఊడిపోవడం సహా పలు జబ్బులు రావడం, డిప్రెషన్​కు లోనవుతారని వివరించారు.

వినోద్ కుమార్​కు నివేదిక అందజేసిన పాండు రంగారావు

ఇవీ చూడండి : ప్రైవేటులోనూ కరోనాకు వైద్యం.. సర్కార్​ కీలక నిర్ణయం..

ABOUT THE AUTHOR

...view details