గర్భిణీలను ఆరోగ్యంగా ఉంచడానికి కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మిసెస్ మామ్స్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ శిల్పిరెడ్డి తెలిపారు.
గర్భిణీలకు మాత్రమే.. మిసెస్ మామ్స్ కాంటెస్ట్! - కిమ్స్ ఆసుపత్రి మిసెస్ మామ్స్ కాంటెస్ట్
గర్భిణీలు... మీకూ ఏదైనా పోటీల్లో పాల్గొనాలనుకుంటున్నారా.. అయితే మీకోసమే ఈ మిసెస్ మామ్స్ కాంటెస్ట్.. గర్భిణీలను ఆనందంగా, ఆరోగ్యకరంగా ఉంచేందుకు కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం ఈ పోటీలను నిర్వహిస్తోంది.
గర్భిణీలకు మాత్రమే.. మిసెస్ మామ్స్ కాంటెస్ట్!
ఈమేరకు హైదరాబాద్ కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్లో సమావేశం నిర్వహించారు. గర్భిణీలను ఆరోగ్యంగా, మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలని ఆమె తెలిపారు. వారిని ఆనందంగా ఉంచడానికి గత నాలుగు సంవత్సరాలుగా ఈ మామ్స్ కాంటెస్ట్ను నిర్వాహిస్తున్నామని పేర్కొన్నారు. గర్భిణీలు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిల్పిరెడ్డి తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పోటీని నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి:ప్రసూతి సేవల్లో ఐదో స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా..