Minority 1 Lakh Scheme in Telangana :రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం ఓట్లను రాబట్టడం కోసం సరికొత్త వ్యూహాలను రచిస్తుంది. ఈ క్రమంలో కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే నేపథ్యంలో తెలంగాణ సర్కార్ సరికొత్త పథకాలను ప్రకటిస్తోంది.
ఇప్పటికేరైతుబంధు(Rhythu Bandu), రైతుబీమా, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ పథకం, నేతన్న బీమా, గృహలక్ష్మి పథకం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా తాజాగా మరో నూతన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏ విధంగా అయితే బీసీ కుల వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం ఇస్తున్నారో... అదే తరహాలో 'మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం(Minority Bandhu Scheme)' అనే నయా పథకాన్ని ప్రకటించింది.
1 Lakh for Minorities Scheme in Telangana Guidelines : ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు, కావాల్సిన ధ్రువపత్రాలు, దరఖాస్తు చేసుకోవాల్సిన తేదీలతో పాటు అర్హతలను(Minorities 1 Lakh Scheme Eligibilities) అధికారులు వెల్లడించారు. ఆన్లైన్ విధానంలోనే ఈ స్కీమ్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. htpps://tsobmmsbc.cgg.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తుదారులు ఆప్లై చేసుకోవచ్చు. అయితేమైనార్టీలందరికీ లక్ష రూపాయల పథకానికిసంబంధించిన దరఖాస్తులు జులై 31 తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ పథకానికి సంబంధించిన ఆర్థికసాయాన్ని సబ్సిడీ వన్‌టైం గ్రాంటుగా అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Gruha Lakshmi Scheme Last Date Today : 'గృహలక్ష్మి'కి నేడే లాస్ట్ డేట్.. అప్లై చేసుకున్నారా..?
ఈ పథకానికి సంబంధించిన అర్హతలివే :
- ముస్లిం మైనార్టీలకు ఈ పథకానికి సంబంధించిన ఆర్థిక సాయాన్ని మైనార్టీ కార్పొరేషన్ నుంచి అందిస్తారు. అలాగే ఇతర మైనార్టీ లబ్ధిదారులకు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఈ స్కీమ్‌కు చెందిన ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.
- దరఖాస్తుల ప్రారంభ తేదీ : జులై 31, 2023
- దరఖాస్తుల గడువు తేదీ : ఆగస్టు 14, 2023
- ఈ పథకానికి జూన్ 2, 2023 నాటికి 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి వారు అర్హులు.
- లబ్ధిదారుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.
- ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
- ఇంతకు ముందు ఏదైనా సంక్షేమ పథకాలను వినియోగించుకున్న లబ్ధిదారులు అనర్హులు.
- జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తుంది.
- లబ్ధిదారుల జాబితా జిల్లా కలెక్టర్లు, ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదం పొందాల్సి ఉంటుంది.
- విడతల వారిగా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేత.