Minority 1 Lakh Distribution Today Telangana :రాష్ట్రంలో మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం(Telangana minorities Rs1 lakh scheme) పంపిణీ.. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఉదయం 11.30 గంటలకు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు అధికారికంగా ప్రారంభించనున్నారు. అదే సమయంలో తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. మైనారిటీ యువత స్వయం ఉపాధి కోసం వంద శాతం రాయితీతో లక్ష రూపాయలను ఆర్థిక సాయం(1 lakh For minorities scheme 2023)గా దానిని ప్రభుత్వం అందించనుంది. తొలి విడతలో భాగంగా దాదాపు పది వేల మందికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సాయం అందించనున్నారు.
1 Lakh Cheques Distribution for Minorities Telangana Today : మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయానికి అఫ్లై చేయాలనుకుంటే.. కావాల్సిన ధ్రువపత్రాలు, విధివిధానాలు, అర్హతలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ దరఖాస్తును ఆన్లైన్లో చేయడానికి వీలుంటుంది. htpps://tsobmmsbc.cgg.gov.in అనే సైట్లోకి వెళ్లి దరఖాస్తు దారులు ఆన్లైన్ అఫ్లికేషన్ నింపాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ పథకానికి సంబంధించిన ఆర్థికసాయాన్ని సబ్సిడీ వన్‌టైం గ్రాంటుగా అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
అర్హతలు :
⦁ ఈ పథకానికి జూన్2, 2023 నాటికి 21 నుంచి 55 సంవత్సరాల మద్య వయస్సు కలిగి ఉండాలి.
⦁ లబ్ధిదారుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.
⦁ ఇంతకు ముందు ఏదైనా సంక్షేమ పథకాలను వినియోగించుకున్న లబ్ధిదారులు అనర్హులు.
దరఖాస్తు సమయంలో కావాల్సిన పత్రాలు :
⦁ఆధార్ కార్డు
⦁రేషన్ కార్డు
⦁ పాన్ కార్డు