తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి​ - today crime news in telanagana

అతనో బాధ్యతాయుతమైన పోలీస్. విచక్షణ మరిచి ఓ మైనర్ బాలికపై ఆత్యాచారం జరిపాడంటూ బాలిక తరఫు బంధువులు ఆరోపించారు. సదురు మైనర్ బాలికకు సొంత మేనమామ అయ్యే పోలీస్ కానిస్టేబుల్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన సికింద్రాబాద్​ పరిధిలో చోటుచేసుకుంది.

Minor girl raped in secundrabad boinpally region
బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం

By

Published : Jun 25, 2020, 7:03 PM IST

సికింద్రాబాద్ బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల బాలికను ఇంటి పక్కనే ఉండే పోలీస్ కానిస్టేబుల్ ఉమేశ్​.. అత్యాచారం చేయడమే కాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బాలికకు కానిస్టేబుల్ ఉమేశ్... వరుసకు సొంత మేనమామ. వావి వరుసలు మరచి అఘాయిత్యానికి పాల్పడ్డట్లు కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కానిస్టేబుల్​పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి:'రామాయణం నుంచి మొదలు పెడితే 1991 దాకా ఒక్కరూ లేరు'

ABOUT THE AUTHOR

...view details