తెలంగాణ

telangana

ETV Bharat / state

17 ఏళ్ల బాలికపై గ్యాంగ్​ రేప్​ - పరారీలో ముగ్గురు నిందితులు - హైదరాబాద్ తాజా వార్తలు

Minor Girl Gang Rape in Hyderabad : సమాజంలో బాలికలు, మహిళలపై అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేదు. ఆడపిల్ల అయితే చాలనుకుని మీద పడిపోతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా హైదరాబాద్​లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 17 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Minor Girl Rape Case On Madhuranagar
Rape on Minor Girl in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2023, 8:24 PM IST

Minor Girl Gang Rape in Hyderabad : ప్రస్తుత కాలంలో ఆడవారు అర్ధరాత్రే కాదు పట్టపగలూ ఒంటరిగా బయటకు రావాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. మహిళల సంరక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా, నిందితులను ఎంత కఠినంగా శిక్షించినా కీచకుల అఘాయిత్యాలు (Atrocities) ఏ మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్​ నగరంలోని మధురానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి చేసిన దారుణ ఘటన వెలుగు చూసింది.

Gang Rape on Minor Girl in Meerpet : హైదరాబాద్‌లో దారుణం.. ఇంట్లోకి దూరి మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

Minor Girl Gang Rape Case On Madura Nagar : మధురానగర్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మోతీనగర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక తమ కుటుంబంతో కలిసి ఉంటుంది. ఎస్ఆర్​ నగర్​లోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతుంది. బాలిక అక్కకు గత ఫిబ్రవరిలో సాయి అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాలికపై సాయి స్నేహితుడు కన్నేశాడు.

గత నెల 25వ తేదీ ఉదయం ఆ బాలిక ఇంటి నుంచి పాల ప్యాకెట్ కోసం కిరాణా దుకాణానికి వెళ్లింది. ఆ సమయంలో యువతి బావ మిత్రుడైన యువకుడు గమనించి అప్పటికే అక్కడ నిలిపి ఉంచిన కారులో మైనర్​ను కిడ్నాప్ చేసి సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొబ్బుగూడ సమీపంలోని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ కారును ఆపి బాలికపై తన బావ స్నేహితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తన అక్కను చంపేస్తామని బాలికను నిందితులు బెదిరించినట్లు పోలీసులు వివరించారు.

ఇంట్లో డ్రాప్​ చేస్తానని.. మైనర్​ బాలికపై అత్యాచారం

Telangana Crime News : బాధితురాలు జరిగిన ఘోరాన్ని తండ్రితో చెప్పలేకపోయిందని పోలీసులు తెలిపారు. తల్లి గుంటూరులో ఉండటంతో తండ్రితో కలిసి అక్కడికి వెళ్లిన బాలిక జరిగిన ఘోరాన్ని తల్లితో చెప్పిందన్నారు. అక్కడి నుంచి తల్లితో కలిసి ఆ బాలిక ఈ నెల 5వ తేదీన మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నేరం జరిగిన ప్రదేశం సనత్​నగర్ పీఎస్ పరిధిలోకి రావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Sexual Harassment on Minor Girls in Hyderabad : చాక్లెట్ ఆశచూపించి మైనర్​ బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై పోక్సో కేసు
Rape on Minor Girl in Hyderabad : సెల్‌ఫోన్ ఆశ చూపి.. మైనర్‌ బాలికపై తండ్రీకుమారుల అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details