పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాల్లేవని కేంద్రజల శక్తి శాఖ స్పష్టం చేసింది. ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణ అవసరం లేదని తేల్చిచెప్పింది. పెంటపాటి పుల్లారావు అనే సామాజిక వేత్త ఫిర్యాదుకు స్పందించిన జలశక్తి శాఖ.... ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాలు లేవు: కేంద్ర జలశక్తి శాఖ - పోలవరం అక్రమాలపై విచారణ
పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాలు లేవన్న కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది.
పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాలు లేవు: కేంద్ర జలశక్తి శాఖ
పోలవరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని ప్రధాని వ్యాఖ్యలు చేశారన్న వ్యాఖ్యలను తోసిపుచ్చిన జలశక్తి శాఖ.... ప్రధాని పోలవరంపై విచారణ జరపమని తమకు ఎక్కడా ఆదేశాలివ్వలేదని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ నివేదికను వాళ్లే పక్కన పెట్టినట్లు కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. నిబంధనలకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోందని... అదే విషయాన్ని ఏపీ ప్రభుత్వం చెప్పిందని జలశక్తి శాఖ ప్రకటించింది.
- ఇదీ చూడండి:ఆ ఒక్క కారణంతో 18 వేల మంది ఖైదీలు విడుదల