తెరాస నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ఢంకా మోగింది. ఈనెల 19న మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజ్భవన్లో ప్రమాణోత్సవం జరగనుంది.
గవర్నర్తో చర్చలు
By
Published : Feb 15, 2019, 2:56 PM IST
|
Updated : Feb 15, 2019, 8:43 PM IST
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న విస్తరణ ప్రక్రియ చేపట్టనున్నారు. మంగళవారం రోజున మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఉదయం 11.30 గంటలకు రాజ్భవన్లో ప్రమాణోత్సవం జరగనుంది. గవర్నర్ నరసింహన్తో భేటీ అయిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.