రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో స్పష్టం చేశారు. కరోనా దుష్ప్రచారంతో పౌల్ట్రీ రంగం రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టపోయిందని తెలిపారు. 45 రోజుల్లో తాను కూడా రూ.10 కోట్లు నష్టపోయానని పేర్కొన్నారు.
'ఆ దుష్ప్రచారంతో ఈటలకు రూ.10కోట్ల నష్టం' - ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
కరోనా దుష్ప్రచారంతో పౌల్ట్రీరంగం తీవ్రంగా దెబ్బతిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల తెలిపారు. చికెన్ అమ్మకాలు తగ్గి సుమారు వేయి కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. వ్యక్తిగతంగా తనకు రూ.పది కోట్ల నష్టం వచ్చిందని సభలో వివరించారు.
ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియా ఈజ్ తెలంగాణ: ఈటల
'ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియా ఈజ్ తెలంగాణ' అని ఈటల స్పష్టం చేశారు. చికెన్‌ను కూడా రాష్ట్రం ఎక్కువగా ఉత్పత్తి చేస్తోందన్నారు. జీఎస్డీపీకి పౌల్ట్రీ రంగం సంవత్సరానికి 12 వందల కోట్లు సమకూరుస్తుందని స్పష్టం చేశారు.
Last Updated : Mar 12, 2020, 7:23 PM IST