తెలంగాణ

telangana

ETV Bharat / state

Saidabad Incident: మరో 20 లక్షలిచ్చినా.. అవసరం లేదు: బాలిక తండ్రి - hyderabad latest news

Minister
Minister

By

Published : Sep 16, 2021, 8:59 AM IST

Updated : Sep 16, 2021, 10:41 AM IST

08:57 September 16

సైదాబాద్ బాలిక కుటుంబానికి మంత్రుల పరామర్శ.. రూ.20 లక్షల చెక్కు అందజేత

సైదాబాద్​ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులను హోమ్ మంత్రి మహమూద్ మహమూద్​ అలీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ పరామర్శించారు. మంత్రుల ఎదుట తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రులు హామీనిచ్చారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు రాజు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. బాలిక తల్లిదండ్రులకు ప్రభుత్వం తరపున రూ.20 లక్షల చెక్కు మంత్రులు అందించారు. బాధిత కుటుంబానికి రెండు పకడ గదుల ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు.  మంత్రుల రాకతో సింగరేణి కాలనీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రుల తీరును నిరసిస్తూ స్థానికుల ఆందోళన చేపట్టారు. సమాచారం లేకుండా హడావిడిగా వచ్చి వెళ్లారని స్థానికులు ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉండగా మంత్రుల సాయాన్ని బాలిక కుటుంబసభ్యులు తిరస్కరించారు. రూ.20 లక్షల చెక్కు అవసరం లేదని తేల్చిచెప్పారు. మంత్రులు ఇచ్చిన చెక్కు వెనక్కి ఇచ్చేస్తామని వెల్లడించారు.

మంత్రులు మా ఇంట్లో చెక్కును పెట్టి వెళ్లిపోయారు. మాకు చెక్కు కాదు... న్యాయం కావాలి. చెక్కుతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మరో రూ.20 లక్షలు అదనంగా ఇచ్చినా అవసరం లేదు.

                 -- బాలిక తండ్రి

ఇదీ జరిగింది...

తల్లిదండ్రులతో ఉంటున్న చిన్నారిపై కన్నేసిన రాజు...  చాక్లెట్‌ ఆశ చూపించి బాలికను తీసుకెళ్లాడు. చిన్నారిపై అత్యాచారం చేసి.. పాశవికంగా హత్యచేసి శవాన్ని తన గదిలో ఉంచి తాళం వేసి బయటకు వచ్చాడు. చిన్నారి కోసం పోలీసులు, తల్లిదండ్రులు, స్థానికులు అన్నిచోట్లా గాలిస్తున్నప్పుడు రాజు స్నేహితుడు అతడిని పక్కకు తీసుకెళ్లి.. ఇక్కడి నుంచి పారిపోవాలంటూ చెప్పినట్లు తెలిసింది.

నిందితుడి కోసం గాలింపు

హత్యాచార నిందితుడు రాజు కోసం దాదాపు పోలీసులు గాలిస్తున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు నిందితుడు మారు వేషాలతో తిరిగే అవకాశం ఉన్నందున, జుట్టు, గడ్డం వంటి మార్పులతో నిందితుడిని పోలి ఉండే చిత్రాలను హైదరాబాద్ పోలీసులు విడుదల చేశారు. నిందితుడ్ని పట్టించిన వారికి రూ.10లక్షలు రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. నిందితుడి ఆచూకీ తెలిసిన వారు 94906 16366 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌ పోలీసులు ఇంత మొత్తంలో రివార్డు ప్రకటించిన దాఖలాలు లేవు.

గతంలోనూ కేసు..

నిందితుడు రాజుపై గతంలోనూ చైతన్యపురి పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. ఆటోను దొంగిలించిన కేసులో గతేడాది అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. అనంతరం బెయిల్​పై బయటకు వచ్చాడు. రాజుకు తండ్రి లేకపోవడంతో, తల్లి కూలీ పనులు చేస్తూ కొడుకును పోషించింది. కేవలం 3వ తరగతి వరకే చదివిన రాజు ఎక్కువగా హైదరాబాద్​లోనే ఉంటాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అప్పుడప్పుడు సొంత గ్రామమైన జనగామ జిల్లా కడకొండ్లకు వెళ్లొస్తుంటాడని చుట్టుపక్కల వారు పోలీసులకు వివరించారు. లేబర్ అడ్డాల్లోనూ రాజు ఒకరిద్దరితోనే మాట్లాడతాడని... వాళ్లతో కలిసి కూలీ పనిచేయగా వచ్చే సొమ్మును పంచుకుంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

సంబంధిత కథనాలు...

Last Updated : Sep 16, 2021, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details