Ministers on Ambedkar statue: భాజపా మూలాలే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వ్యతిరేకమని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాఠోడ్ అన్నారు. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్, భాజపాల నాయకులకు లేదన్నారు. హుస్సేన్‌సాగర్ సమీపంలో 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు.
దేశం గర్వించేలా హైదరాబాద్‌లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని మంత్రులు తెలిపారు. దీనిపై కాంగ్రెస్, భాజపా నాయకులు విమర్శలు చేయడం శోచనీయమన్నారు. విగ్రహ ఏర్పాట్లు శరవేగంగా జరుతున్నాయని.. త్వరలోనే ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రాజయ్య, మాజీ ఎంపీ సీతారాములు నాయక్, ఎమ్మెల్యే క్రాంతికుమార్, పలువురు ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
దీనిపై భాజపా, కాంగ్రెస్ నాయకులు అనవసర రాద్ధాంతం చేయడం దురదృష్టకరం. ఇదీ ఒక సంకల్పం. భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మేధావి విగ్రహాన్ని ెట్టడానికి కూడా మీకు సోయి లేదు. అదీ కూడా ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట మేరకు అసెంబ్లీ ప్రాంగణంలో నిర్మాణం చేసుకున్నాం. ఇవాళ దీనిపై మీకు మాట్లాడానికి కూడా అర్హత లేదు. పేద వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్లు ఆరోపణలు చేయడం తగదు. ప్రజలే మీకు సరైన సమయంలో బుద్ధి చెబుతారు. -కొప్పుల ఈశ్వర్, మంత్రి
భాజపా నాయకులకు వారి చరిత్ర తెలియకపోవడం శోచనీయం. రాజ్యాంగాన్ని గౌరవించకుండా కొంతమంది విమర్శలు చేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడే రాజ్యాంగాన్ని సవరించాలని కమిటీ వేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినా సవరించుకునే హక్కును ఆయన కల్పించారు. కొంతమంది చరిత్రహీనులు ముఖ్యమంత్రిని విమర్శించటం సరికాదు. వారి ఆశయాలు నెరవేర్చేకునేందుకు మేం కృషి చేస్తాం. భవిష్యత్ తరాలకు వారి చరిత్రను చెప్పే విధంగా విగ్రహాన్ని నిర్మిస్తున్నాం. - సత్యవతి రాఠోడ్, రాష్ట్ర మంత్రి
ఇదీ చూడండి: