dudimetla balarajyadav: రాష్ట్రంలో తాడు బొంగురం లేని కాంగ్రెస్, భాజపా ఇష్టమొచ్చినట్లు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాయని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆక్షేపించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి సహకార సంస్థ కార్యాలయంలో మంత్రి సమక్షంలో ఆ సంస్థ ఛైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన తెరాస నాయకులు, శ్రేణులు కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన బాలరాజుయాదవ్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎంతగానో అభివృద్ధి జరిగింది..
minister talasani comments on bjp: ప్రతిసారి భాజపా హిందుత్వాన్ని ముందుకు తీసుకొస్తోందని... ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే పెద్ద హిందువు ఉన్నారా అని మంత్రి తలసాని ప్రశ్నించారు. ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్వయంగా నిర్మించడమే కాకుండా కొమరవెల్లి మల్లన్న, వేములవాడ, భద్రాచలం దేవస్థానాలను ఎంతగానో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. విశిష్ట కృష్ణ, గోదావరి పుష్కరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ సీఎం అన్ని వర్గాల మనసులు చూరగొన్నారని చెప్పారు. ధాన్యం కొనుగోలు అంశంలో కూడా భాజపా, కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సాధనలో వెన్ను వెరవకుండా పనిచేసిన బాల్క సుమన్, గాదరి కిషోర్ నుంచి సాయిచంద్, బాలరాజు లాంటి యువకులకు రాజకీయ, అధికార పదవుల్లో సైతం ముఖ్యమంత్రి గొప్ప అవకాశం కల్పించి ప్రజాసేవ చేసే భాగ్యం కలిగించారని మంత్రి తలసాని తెలిపారు.
ఆ ఘనత ప్రభుత్వానిదే..