తెలంగాణ

telangana

ETV Bharat / state

Ministers On Women's Day: ' మహిళల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట'

Ministers On Women's Day: 'మహిళబంధు కేసీఆర్' పేరిట మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్ కోరారు. ఈ వేడుకల్లో మహిళందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

Ministers On Women's Day
మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్

By

Published : Mar 4, 2022, 11:15 PM IST

సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్

Ministers On Women's Day: రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చే వరకు ఒక అన్నలా కేసీఆర్ అండగా నిలుస్తున్నారని మంత్రులు పేర్కొన్నారు. 'మహిళాబంధు కేసీఆర్ ' పేరిట అందుకు మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రులు కోరారు. రాష్ట్రంలోని మహిళలందరూ ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని తెలిపారు.

కేటీఆర్ పిలుపు మేరకు ఈనెల 6, 7, 8 తేదీల్లో మహిళ దినోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యమిస్తున్నారని మంత్రులు వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి, రాజకీయాల్లో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తున్నారని మంత్రులు వివరించారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దేశంలో ఎక్కడా లేని పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ సర్కారుదేనన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా సుమారు 11 లక్షల మంది లబ్ధి పొందారని తెలిపారు. మహిళల కోసం దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని వివరించారు.

షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి తీసుకున్న కీలక నిర్ణయం. మహిళ సంఘాల ద్వారా వ్యాపారాలు చేసుకోవడానికి సీఎం పోత్సహిస్తున్నారు. ప్రతి గ్రామంలో మహిళలు వ్యాపారం చేసుకునేందుకు వీలు కల్పించారు.

-సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి

ఆస్పత్రుల్లో ప్రసవాల తర్వాత సరైన పోషకాహారం అందించి మాతా, శిశు మరణాలు తగ్గించాం. మహిళల కోసం అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్​దే. ఈ రాష్ట్ర మహిళా లోకమంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటుంది.

- సత్యవతి రాఠోడ్, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details