తెలంగాణ

telangana

ETV Bharat / state

SECUNDERABAD BONALU: ఈనెల 17న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు.. - హైదరాబాద్ తాజా వార్తలు

SECUNDERABAD BONALU: ఈనెల 17,18 తేదీల్లో జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల కోసం ప్రభుత్వం ఈ ఏడాది కూడా భారీ ఏర్పాట్లు చేస్తోంది. వేడుకల నిర్వహణపై మంత్రులు అధికారులతో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్​ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులకు మంత్రులు సూచించారు.

ఉజ్జయిని మహంకాళి జాతర
ఉజ్జయిని మహంకాళి జాతర

By

Published : Jul 8, 2022, 4:24 PM IST

SECUNDERABAD BONALU: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్​ మహంకాళి దేవాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్​ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 17,18 వ తేదీల్లో అమ్మవారి జాతర నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. వారంలోగా ఆలయంలో చేపట్టిన పనులను పూర్తి చేయనున్నట్లు తెలియచేశారు.

ఉజ్జయిని మహంకాళి జాతరను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్థానిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషిచేయడం సంతోషకరమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బోనాల పండుగకు ఎంతో విశిష్టత ఉందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని ఉజ్జయిని మహంకాళి జాతరను ఘనంగా నిర్వహిస్తామని హోంమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్​ తదితరులు హజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details