తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ: నవంబర్​ నెలలో తుంగభద్ర పుష్కరాల నిర్వహణ - తుంగభద్ర పుష్కరాలపై మంత్రుల సమీక్ష వార్తలు

నవంబరులో తుంగభద్ర పుష్కరాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్​ అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అమరావతిలోని కార్యాలయం నుంచి మంత్రులు జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కర్నూలు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.

tungabhadra pushkaralu to be held in november
ఏపీ: నవంబర్​ నెలలో తుంగభద్ర పుష్కరాల నిర్వహణ

By

Published : Sep 18, 2020, 9:47 AM IST

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నవంబరు 20 నుంచి డిసెంబరు ఒకటో తేదీ వరకు నిర్వహించనున్న తుంగభద్ర పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్​ కర్నూలు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, అనిల్‌కుమార్‌ ఆదేశించారు. పుష్కర ఘాట్ల పనులను నాణ్యతతో చేపట్టాలన్నారు. ఏపీలోని అమరావతిలోని కార్యాలయం నుంచి మంత్రులు జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కర్నూలు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ప్రజాప్రతినిధులు, అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. పనులకు సంబంధించి బడ్జెట్‌ ప్రతిపాదనలు తక్షణ, దీర్ఘకాలిక అవసరాలుగా విభజించి శుక్రవారంలోపు పంపాలని సూచించారు. కర్నూలు జిల్లాలో పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే 18 కమిటీలు వేసినట్లు కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. ప్రాధాన్య ప్రాంతాల్లో 17 ఘాట్లను గుర్తించామని, వీటికి సంబంధించి బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఇప్పటికే గుర్తించిన ఘాట్లతోపాటు భక్తుల సౌకర్యార్థం మరిన్ని ఏర్పాటు చేయాలని సమావేశంలో కర్నూలు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:రాజ్యసభ: న్యాయవ్యవస్థపై విజయసాయి వ్యాఖ్యల తొలగింపు

ABOUT THE AUTHOR

...view details