కరోనా కారణంగా మూతపడిన విద్యాసంస్థలను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పున:ప్రారంభించాలన్న (schools reopen) నిర్ణయానికి అనుగుణంగా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నామని... కొవిడ్ నిబంధనలకు లోబడి రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో భౌతికతరగతులు ప్రారంభించాలని ఆదేశించింది. విద్యాసంస్థల పున:ప్రారంభం సన్నాహకాలను ప్రారంభించిన సర్కారు... సన్నద్ధతపై ఆయా శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్య, వైద్య, పంచాయతీరాజ్, పురపాలక శాఖల అధికారులు, గురుకులాల అధికారులు, జడ్పీ ఛైర్మన్లతో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి (sabitha), ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli)దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించాలి
భౌతికతరగతుల ప్రారంభానికి అనుగుణంగా విద్యాసంస్థలను సిద్ధం చేసే విషయమై మార్గనిర్ధేశం చేశారు. 17 నెలల తర్వాత 65 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నందున తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకు అనుగుణంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకొని... విద్యాసంస్థలను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. భౌతిక తరగతులు ప్రారంభమైతే ఆన్లైన్ తరగతులు నిర్వహించేది లేదని ప్రభుత్వం తెలిపింది. ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని విద్యాసంస్థల్లోనూ పరిశుభ్రత, జాగ్రత్తలు పాటించేలా డీఈఓలు, అధికారులు పర్యవేక్షించాలని తెలిపింది. పాఠశాలలు తెరవాలని తల్లిదండ్రులు కోరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఫీజుల విషయంలో ప్రైవేటు విద్యాసంస్థలు గతంలో జారీ చేసిన ఆదేశాలు పాటించాలని మంత్రి సూచించారు. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే నెల వారీ వసూలు చేయాలని స్పష్టం చేశారు.
ఈనెల 30లోగా సిద్ధం చేయాలి..