పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమని, సికింద్రాబాద్ నుంచి మంచి ఆధిక్యత లభించేలా కృషి చేస్తామని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సీతాఫల్మండిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. తెరాస అభ్యర్థి సురభి వాణి దేవికి పట్టభద్రుల నుంచి మంచి స్పందన లభిస్తోందని గంగుల కమలాకర్ అన్నారు.,
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రుల సమీక్ష - telangana varthalu
సీతాఫల్మండిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రులు తలసాని, గంగుల కమలాకర్, ఉపసభాపతి పద్మారావు గౌడ్ సమీక్ష నిర్వహించారు. తెరాస అభ్యర్థి వాణిదేవిని గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రుల సమీక్ష
పార్టీ అభ్యర్థి వాణిదేవిని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కంకణబద్ధులు కావాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. సికింద్రాబాద్ పరిధిలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసినట్లు పద్మారావు గౌడ్ తెలిపారు.
ఇదీ చదవండి: కేటీఆర్ చేతుల మీదుగా జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ