తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఫిబ్రవరి రెండో వారం కల్లా అంబేడ్కర్ విగ్రహం పనులు పూర్తి'

Ambedkar Statue at Hussain sagar : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హుస్సేన్​సాగర్​ వద్ద సిద్ధమవుతున్న అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు.. ఫిబ్రవరి రెండో వారం కల్లా విగ్రహం పనులు పూర్తవుతాయని తెలిపారు.

By

Published : Nov 28, 2022, 4:16 PM IST

Updated : Nov 28, 2022, 5:01 PM IST

Ministers
Ministers

Ministers inspected Ambedkar Statue Construction: ఫిబ్రవరి రెండో వారం కల్లా హుస్సేన్​సాగర్ వద్ద నిర్మిస్తున్న అంబేడ్కర్ విగ్రహం పనులు పూర్తవుతాయని మంత్రులు ప్రశాంత్​రెడ్డి, కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని మంత్రులు స్పష్టం చేశారు. అంబేడ్కర్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అపార గౌరవం ఉందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్‌ స్థాయికి తగ్గట్టుగానే విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్ఫూర్తినిచ్చేలా అంబేడ్కర్‌ మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేస్తామని ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు.

'ఫిబ్రవరి రెండో వారం కల్లా అంబేడ్కర్ విగ్రహం పనులు పూర్తి'

'అంబేడ్కర్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అపార గౌరవం. అంబేడ్కర్‌ స్థాయికి తగ్గట్టుగానే విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. స్ఫూర్తినిచ్చేలా అంబేడ్కర్‌ మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేస్తాం. ఫిబ్రవరి రెండో వారం కల్లా విగ్రహం పనులు పూర్తవుతాయి. అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో జనరంజకంగా పాలన కొనసాగిస్తున్నారు. ఏడాది ఏప్రిల్ 14న హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతోంది.'-వేముల ప్రశాంత్​రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మంత్రులు

అంతకుముందు హైదరాబాద్‌లో అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. హుస్సేన్‌సాగర్ వద్ద సిద్ధమవుతున్న 125 అడుగుల విగ్రహం పనులపై అధికారులను ఆరా తీశారు. ట్యాంక్‌బండ్‌పై 11 ఎకరాల స్థలంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. నిర్మాణం పూర్తైతే ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహంగా చరిత్ర సృష్టించనుందని మంత్రులు ప్రశాంత్​రెడ్డి, కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 28, 2022, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details