ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి మొక్కలు నాటి సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయం ఆవరణలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఖైరతాబాద్‌లోని ఆర్టీఎ కార్యాలయం ఆవరణలో పువ్వాడ అజయ్ కుమార్, జల్‌పల్లి పరిధి పహాడీషరీఫ్, మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్, బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు మొక్కులు నాటారు.
కేసీఆర్‌కు మొక్కలతో మంత్రుల శుభాకాంక్షలు - ఖైరతాబాద్‌లోని ఆర్టీఎ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన పువ్వాడ అజయ్
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డిలు మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రులు ఆకాంక్షించారు.
![కేసీఆర్‌కు మొక్కలతో మంత్రుల శుభాకాంక్షలు ministers celebrate cm kcr birth day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6104593-890-6104593-1581941468410.jpg)
సీఎం పుట్టిరోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రులు
ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని మంత్రులు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు ప్రభుత్వం తలపెట్టిన హరితహార కార్యక్రమం యజ్ఞంలా సాగుతుందన్నారు. కేవలం ప్రైవేటు విద్యా సంస్థల్లోనే లక్షా 16 వేల మొక్కలు నాటినట్లు మంత్రి సబితా పేర్కొన్నారు. తెరాస నేతలు... సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సబితా ఇంద్రారెడ్డికి చెక్కులు అందజేశారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రులు ఆకాంక్షించారు.
సీఎం పుట్టిరోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రులు
ఇవీ చూడండి:జలవిహార్‌లో ఘనంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు
Last Updated : Feb 17, 2020, 7:25 PM IST