తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR BIRTHDAY: కేటీఆర్​ జన్మదిన వేడుక.. ముక్కోటి వృక్షార్చనలో మంత్రులు

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ జన్మదినాన.. రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం కనులపండువగా జరిగింది. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా.. ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపారు. పలు జిల్లాల్లో మంత్రులు వేడుకల్లో పాల్గొని సంబురాలు జరుపుకున్నారు.

KTR BIRTHDAY
కేటీఆర్​ జన్మదిన వేడుక

By

Published : Jul 25, 2021, 3:49 AM IST

Updated : Jul 25, 2021, 5:38 AM IST

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు కోటి వృక్షార్చనలో పాల్గొన్నారు. కొందరు సేవాభావాన్ని చాటగా.. మరికొందరు వినూత్న రీతిలో కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన ముక్కోటి వృక్షార్చనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మెుక్కలు నాటారు. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా.. ప్రజాప్రతినిధులు మొక్కలునాటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు వేడుకల్లో పాల్గొన్నారు.

ఖిలా వరంగల్‌ కోట, జనగామ జిల్లా దేవురుప్పుల మండలం కొలుకొండలో పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మొక్కలు నాటారు. ఓరుగల్లు సమగ్రాభివృద్ధికి కేటీఆర్ ఏటా 500 కోట్ల నిధులిచ్చేందుకు అంగీకరించారని వెల్లడించారు.

కేటీఆర్​ జన్మదినం పురస్కరించుకుని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో మొక్కలు నాటారు. హరితహారం, గ్రీన్‌ఛాలెంజ్‌ వల్ల అడవుల విస్తీర్ణం పెరుగుతోందన్నారు.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని అటవీ ప్రాంతంలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, జిల్లా పాలనాధికారితో కలిసి మొక్కలు నాటారు.

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రామచంద్రపురం శివారు చింతోనిగుంపు శివారులోని 10 ఎకరాల మెగా ప్రకృతి వనంలో మంత్రి సత్యవతి రాఠోడ్.. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే హరిప్రియతో కలిసి మొక్కలు నాటారు.

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్ సుల్తాన్​బజార్​ వారి ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మానవపాడు మండల కేంద్రంలో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. గ్రంథాలయ ఆవరణలో ఎమ్మెల్యే జెడ్పి ఛైర్​పర్సన్​తో కలిసి మొక్కలు నాటారు.

నిర్మల్​లో నిర్వహించిన కేటీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో పాటు గులాబీ నేతలు, కార్యక‌ర్త‌లు, అభిమానులు, ప్ర‌జ‌లు పాల్గొన్నారు. అట‌వీ శాఖ ఆధ్వర్యంలో నిర్మల్ మండలం కొండాపూర్ స‌మీపంలో జాతీయ ర‌హ‌దారికి ఇరువైపుల ముక్కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మంలో భాగంగా 3 ల‌క్ష‌లు మొక్క‌లు నాటే కార్యక్ర‌మంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొని మొక్క‌లు నాటారు.

కరీంనగర్​లో ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్​లో నిర్వహించిన బర్త్​ డే వేడుకల్లో బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. భారీ కేకును కేకును కట్ చేసి సంబరాలను నిర్వహించారు. అనంతరం ముక్కోటి వృక్షార్చణలో భాగంగా మొక్కలు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి మంత్రికి హరిత శుభాకాంక్షలు తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వినూత్న రీతిలో కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఇల్లందుపాడు అలుగులో.. మత్తడి దుంకుతున్న నీటిలో కేక్‌ కోసి సంబరాలు నిర్వహించారు.

పలు చోట్ల సేవా కార్యక్రమాలు

కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన ఏడుగురు చిన్నారులకు.. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. రెండున్నర లక్షల సాయం అందించారు. హైదరాబాద్‌లో క్యాంపస్‌ క్రాప్‌ సంస్థ పేదవిద్యార్థులను చదివించేందుకు ముందుకొచ్చింది. గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా గిఫ్ట్‌ ఏ కెరీర్‌... పేరుతో సేవకు శ్రీకారం చుట్టారు. పలుచోట్ల విద్యార్థులకు పుస్తకాలు, డిక్షనరీలు అందించి.. కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చూడండి:

సోషల్ మీడియాలో కేటీఆర్ హవా.. పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

KTR BIRTHDAY: మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

KTR BIRTHDAY: ప్రజలకు అందుబాటులో ఉండండి.. అదే నాకు ఇచ్చే బహుమతి

Last Updated : Jul 25, 2021, 5:38 AM IST

ABOUT THE AUTHOR

...view details