తెలంగాణ

telangana

ETV Bharat / state

Ministers One Crore Plants Planted In Haritha Haram : కోటి మొక్కలు నాటే హరితహారం కార్యక్రమం ప్రారంభించిన మంత్రులు

Ministers One Crore Plants Planted In Haritha Haram : హరితహారంలో భాగంగా నేడు రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఫారెస్ట్​ బ్లాక్​లో కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ ఫారెస్ట్​ బ్లాక్​ పరిధిలోని మంచిరేవుల వద్ద అటవీ అభివృద్ధి సంస్థ తీర్చిదిద్దిన ఫారెస్ట్​ ట్రెక్​ పార్క్​ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు.

Ministers One Crore Plants Planted In Haritha Haram
Telangana Haritha Haram 2023

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2023, 3:49 PM IST

Ministers One Crore Plants Planted In Haritha Haram : స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కోటి వృక్షార్చన హరితహారం(Haritha Haram) కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పల్లెలు, పట్టణాల్లో కోటి మొక్కలు(One Crore Plants) నాటేందుకు నడుంబిగించారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఫారెస్ట్​ బ్లాక్(CHILUKURU Fotest Block)​లో.. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఈ ఫారెస్ట్​ బ్లాక్​ పరిధిలోని మంచిరేవుల వద్ద అటవీ అభివృద్ధి సంస్థ తీర్చిదిద్దిన ఫారెస్ట్​ ట్రెక్​ పార్క్​ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం ట్రెక్​ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి మొక్కలు నాటారు.

Haritha Haram Scheme In Telangana : ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు.. కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటాలని మంత్రులు కోరారు. 360 ఎకరాల విస్తీర్ణంలో అటవీ అభివృద్ధి సంస్థ తీర్చిదిద్దిన ఫారెస్ట్​ ట్రెక్​ పార్కును మంత్రులు సందర్శించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్​ మహానగర ఆకాశ హర్మ్యాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వాచ్​ టవర్​ అదనపు ఆకర్షణగా నిలువనుంది.

Indian Forest Survey Report 2023 : హరితహారం ద్వారా తొమ్మిదేళ్లలో 273 కోట్ల మొక్కల పెంపకం

"ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ఇంతమంచి పార్కు రావడం వల్ల ల్యాండ్​ ప్రోటెస్ట్​తో పాటు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో రోజూ వాకింగ్​ చేయవచ్చు. ప్రతిరోజు 3000 మంది ఇక్కడ వాకింగ్​ చేయడానికి వీలుగా ఉంటుంది. సెలవు రోజుల్లో అయితే 5వేల మంది ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్​ చుట్టూ 60 నుంచి 70 పార్కులు అందుబాటులోకి వచ్చాయి. 119 పార్కులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి ఒక పార్కు ఫారెస్టు డిపార్టుమెంటు అందుబాటులోకి తేవడం జరుగుతుంది." -ఇంద్రకరణ్​ రెడ్డి, మంత్రి

KTR Tweet On Haritha Haram : 'హరితహారం.. పుడమితల్లికి వెలకట్టలేని ఆభరణం'

Haritha Haram 2023 In Telangana : హరితహారంలో భాగంగా కోటి మొక్కలను నాటాలని సంకల్పించుకున్నామని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పండగలా జరిగిందని అన్నారు. ఇప్పటికీ 230 లక్షల కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించుకుంటే 270 లక్షల కోట్ల మొక్కలు నాటామని హర్షించారు.

Telangana Haritha Haram 2023 : ఇప్పటివరకు నాటిన మొక్కల్లో 80 శాతం బతికాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది 30 కోట్ల మొక్కలు నాటే ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు. పార్కులో గజీబో, వాకింగ్​ ట్రాక్​, ట్రెక్కింగ్​, రాక్​ పెయింటింగ్​ వంటి తదితర సదుపాయాలు ఉన్నాయి. మంత్రులు ఫారెస్ట్​ ట్రెక్​ పార్కునంతా ప్రత్యేక వాహనంలో కలియతిరిగారు.

Ministers One Crore Plants Planted In Haritha Haram కోటి మొక్కలు నాటే హరితహారం కార్యక్రమం ప్రారంభించిన మంత్రులు

Harish Rao on Haritha Haram : 'దేశంలోనే 7.4 శాతం గ్రీన్ కవర్ పెంచిన ఏకైక రాష్ట్రం.. మన తెలంగాణ'

నేడు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక హరితహారం, పాల్గొననున్న ప్రజాప్రతినిధులు, అధికారులు

ABOUT THE AUTHOR

...view details