తెలంగాణ

telangana

ETV Bharat / state

'కుప్పంలో ఓటమిని అంగీకరిస్తూ చంద్రబాబు రాజీనామా చేయాలి' - మంత్రి పెద్దిరెడ్డి

తెలుగుదేశం పార్టీ కుప్పంలోనే కూలిపోయే పరిస్థితికి వచ్చిందని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇందుకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

'కుప్పంలో ఓటమిని అంగీకరిస్తూ చంద్రబాబు రాజీనామా చేయాలి'
'కుప్పంలో ఓటమిని అంగీకరిస్తూ చంద్రబాబు రాజీనామా చేయాలి'

By

Published : Feb 18, 2021, 4:44 PM IST

ఏపీలోని కుప్పం నియోజకవర్గంతో పాటు ఆ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా సర్పంచ్​ స్థానాల్లో వైకాపా బలపరచిన అభ్యర్థులు గెలుపొందారని ఆ రాష్ట్ర మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. చంద్రబాబు నియోజకవర్గంలోనూ మెజార్టీ స్థానాలను తామే దక్కించుకున్నామన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 34 శాతం సీట్లను తాము గెలిచామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కుప్పం నియోజకవర్గంలో ఉన్న 89 గ్రామ పంచాయతీల్లో 74 గ్రామాల్లో వైకాపా ,14 స్థానాల్లో తెదేపా బలపరచిన అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు. ఈ ఫలితాలు చూశాక చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పోటీచేయాలంటే భయపడుతున్నారని అన్నారు. ప్రజల తీర్పును గౌరవించి ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

జగనన్న చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు వైకాపాను గెలిపించారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉందని అన్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా కాకుండా.. ఒకసారి ప్రధానమంత్రి కావాలని.. అది తన కోరిక అని వివరించారు. మూడో విడతలో వైకాపాకు 2,574 సర్పంచ్​ స్థానాలు దక్కాయి.

'కుప్పంలో ఓటమిని అంగీకరిస్తూ చంద్రబాబు రాజీనామా చేయాలి'

ఇదీ చూడండి:అజ్మీర్ దర్గాకు చాదర్​ పంపిన సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details