తెలంగాణ

telangana

ETV Bharat / state

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతిపై మంత్రుల సంతాపం - mourning to pranab

రాజకీయాల్లో భీష్మాచార్యులు.. ఆర్థిక మంత్రిగా విశిష్ట సేవలు చేసిన మహానేత భారత మాజీ ప్రధాని ప్రణబ్‌ ముఖర్జీ. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆయన మరణం పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు.

ministers-mourning-on-pranab-mukherjee-death
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతిపై మంత్రుల సంతాపం

By

Published : Aug 31, 2020, 10:01 PM IST

భారత మాజీ రాష్ట్రపతి, సీనియర్ రాజకీయవేత్త ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల పలువురు రాష్ట్ర మంత్రులు సంతాపం తెలిపారు. రాజకీయ కురువృద్ధుడు, భారతర్న, ప్రణబ్ ముఖర్జీ మృతి రాజకీయాలకు తీరని లోటు అని పేర్కొన్నారు.

నిరంజన్‌ రెడ్డి

భారత మాజీ రాష్ట్రపతి, సీనియర్ రాజకీయవేత్త ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నానని తెలిపారు. భారత రాజకీయాల్లో భీష్మాచార్యులు ప్రణబ్ ముఖర్జీ అని గుర్తు చేశారు. యావత్ తెలంగాణ సమాజం ప్రణబ్‌ ముఖర్జీని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.

జగదీశ్‌ రెడ్డి

ప్రణబ్‌ ముఖర్జీ మృతిపట్ల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగధీశ్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. అయన మరణం దేశానికి తీరనిలోటని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో భాగస్యాములైన మహానేత మరణం బాధకరమన్నారు. తెలంగాణ సమాజం ప్రణబ్‌ ముఖర్జీని ఎప్పటికీ మరవదన్నారు.

శ్రీనివాస్‌గౌడ్‌

ప్రణబ్‌ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు అని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ప్రణబ్‌ మంత్రిపై సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. రాష్ట్రపతి హోదాలోనే రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదానికి రాజ ముద్ర వేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.

పువ్వాడ అజయ్‌కుమార్‌

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నిబద్ధతతో సాధారణ కార్యకర్త నుంచి అత్యున్నత పదవులు అలంకరించారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ప్రణబ్‌ మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:రాజనీతిలో సరిలేరు మీకెవ్వరూ..

ABOUT THE AUTHOR

...view details