తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాల నేపథ్యంలో శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కేంద్రంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారికి నెగెటివ్ నివేదికలు వచ్చాయి. వారితోపాటు 58 మంది శాసనసభ్యులు, 19 మంది మండలి సభ్యులు, 500 మంది పాత్రికేయులు, అధికారులు, సిబ్బందికి పరీక్షలు జరిగాయి.
ఒక ఎమ్మెల్సీ గన్‌మెన్, ఓ ఉద్యోగి, ఒక పాత్రికేయుడికి కరోనా నిర్ధరణ అయింది. దీంతో వారిని ఐసొలేషన్‌కు పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. హరీశ్‌రావు మినహా మిగతావారికి నెగెటివ్ నివేదికలు వచ్చాయి.