గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వివిధ పార్టీల నేతలు వెల్లువలా తరలివస్తున్నారు. నగరంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు... పోలింగ్ బూత్‌ల వద్ద వరుసలో నిల‌్చోని ఓటేస్తున్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలో ప్రజలు తమ ఓటుహక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు.
గ్రేటర్‌లో ఓటేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు - జీహెచ్ఎంసీ పోల్స్ 2020 తేదీ
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం మందకొడిగా పోలింగ్ నమోదు కాగా.. క్రమంగా కేంద్రాల వద్ద రద్దీ పెరుగుతోంది. పోలింగ్‌లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
కూకట్‌పల్లిలోని శేషాద్రినగర్‌లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..... ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ ఓటు వేశారు. శేరిలింగంపల్లిలోని వివేకానంద నగర్ క్లబ్‌హౌస్‌లో స్థానిక శాసనసభ్యులు అరికెపుడి గాంధీ... ఉప్పల్‌లో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి... సతీమణి స్వప్నతో కలిసి ఓటు వేశారు. అటు ముషీరాబాద్‌లోని జవహర్‌నగర్ కార్మిక భవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్యే ముఠాగోపాల్, తెరాస అభ్యర్థి ముఠా పద్మ, అల్వాల్‌లోని వెంకటాపురం 135 డివిజన్ మహాబోధి స్కూల్లో ప్రజాగాయకుడు గద్దర్, తార్నాకలో భాజపా ఎమ్మెల్సీ రామచంద్రారావు, అంబర్‌పేట్‌లో మురళీధర్‌రావు కుటుంబసమేతంగా వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. పాతబస్తీలోని శాస్త్రిపురంలో ఉదయాన్నే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అల్వాల్ 134 డివిజన్లో మాల్కాజిగిరి శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు కుటుంబ సమేతంగా వచ్చి... త్రివేణి స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.