కొత్త సార్సాల ఘటనపై రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి... రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీతో చర్చించారు. అటవీశాఖ సిబ్బందికి రక్షణ కల్పించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని హోమంత్రి పేర్కొన్నారు. ఇటీవల కాగజ్‌నగర్‌లో జరిగిన సంఘటనలో అటవీశాఖ సిబ్బంది గాయపడటం, సిబ్బంది రక్షణ విషయంలో అటవీశాఖ మంత్రిని కలిసి ఉద్యోగులు విన్నవించటం వల్ల ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. సిబ్బందికి రక్షణ కల్పించే విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని, దాడి చేసిన వారెవరైనా కఠిన శిక్షలు పడేలా చేస్తామని హోంమంత్రి తెలిపారు.
అటవీశాఖ అధికారి దాడి ఘటనపై మంత్రుల భేటీ - INDRAKARAN REDDY
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ అధికారిపై జరిగిన దాడి ఘటన గురించి అటవీశాఖ మంత్రి, హోం మంత్రితో చర్చించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
![అటవీశాఖ అధికారి దాడి ఘటనపై మంత్రుల భేటీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3729339-1083-3729339-1562107714899.jpg)
అటవీశాఖ అధికారి దాడి ఘటనపై మంత్రుల భేటీ
Last Updated : Jul 3, 2019, 7:39 AM IST