రాష్ట్ర ప్రజలకు మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ప్లవ నామ సంవత్సరంలో అన్ని విధాల శుభం కలగాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి ట్వీట్ చేశారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో సంతోషంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు - తెలంగాణ వార్తలు
రాష్ట్ర ప్రజలకు మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరంలో అన్ని విధాలా శుభం కలగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మంత్రులు ట్వీట్ చేశారు.
మంత్రులు ఉగాది శుభాకాంక్షలు , తెలంగాణ మంత్రుల శుభాకాంక్షలు
ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడాలని మంత్రి ఈటల రాజేందర్ ఆకాంక్షించారు. పాడిపంటలతో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని కోరారు. ప్రజలందరూ వైరస్ బారిన పడకుండా తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ... రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: 'రైతుల జీవితాల్లో వసంతాలు తెచ్చి.. పున్నవి వెలుగులు నింపడమే లక్ష్యం'