రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు తెలంగాణ రాష్ట్రంలో సాకారం అవుతున్నాయని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 20వ శతాబ్దంలో దళితులకు సామాజిక న్యాయం దొరికితే.. 21వ శతాబ్దంలో ఆర్థిక సాధికారతతో దళితులు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
అదేవిధంగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు.. దళితబంధు పథకం ప్రారంభం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దళిత కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. 10 లక్షలు కేటాయించడం.. వారి అభ్యున్నతికి ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేశారు.