తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలు మృతిపట్ల కేటీఆర్​, హరీశ్​ రావు విచారం - ఎస్పీ బాలు మృతిపట్ల హరీశ్​ రావు సంతాపం

బాలు మృతి సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు తీరని లోటని కేటీఆర్​ ఆవేదన వ్యక్తం చేశారు. వేల పాటల ద్వారా ప్రజల మనసుల్లో సుస్థిరంగా నిలుస్తారని కొనియాడారు. సినీ ప్రపంచానికి గాన గంధర్వుడు చేసిన సేవలు వెలకట్టలేవని మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. ఎస్పీబీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బాలు మృతిపట్ల కేటీఆర్​, హరీశ్​ రావు విచారం
బాలు మృతిపట్ల కేటీఆర్​, హరీశ్​ రావు విచారం

By

Published : Sep 25, 2020, 4:12 PM IST

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల మంత్రులు కేటీఆర్​, హరీశ్​ రావు విచారం వ్యక్తం చేశారు. బాలు మృతి సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు తీరని లోటని కేటీఆర్​ ఆవేదన వ్యక్తం చేశారు. వేల పాటల ద్వారా ప్రజల మనసుల్లో సుస్థిరంగా నిలుస్తారని కొనియాడారు.

సినీ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి విచారకరం. సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు, వారి అభిమానులకు తీరని లోటు. ఆలపించిన ఎన్నో వేల పాటల ద్వారా వారు ప్రజల మనసుల్లో సుస్థిరంగా నిలుస్తారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

-కేటీఆర్​, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి

సినీ ప్రపంచానికి బాలు చేసిన సేవలు వెలకట్టలేవని మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. ఎస్పీబీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం దురదృష్టకరం. సినీ లోకానికి వారు చేసిన సేవలు వెలకట్టలేనివి. అనేక భాషల్లో పాటలు పాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బాలు.. లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

-హరీశ్​ రావు, ఆర్థిక మంత్రి

ఇదీ చదవండి:దివికేగిన గానగంధర్వుడు- ఎస్పీ బాలు అస్తమయం

ABOUT THE AUTHOR

...view details