ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ, భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ ముందుకెళ్తున్నామని వివరించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాఠోడ్, ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.
కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశ మందిరం ప్రారంభించారు. అనంతరం కమిషన్ వెబ్‌సైట్, బ్రోచర్‌తోపాటు పౌరహక్కుల దినోత్సవ ప్రతిజ్ఞ, పౌరహక్కుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరించారు.