తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిమ్మగడ్డ పట్టుదల, ఒక పార్టీ కుట్రకు నిదర్శనమే ప్రస్తుత పరిస్థితి' - ఏపీ పంచాయతీ ఎన్నికలు

ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు తెలిపారు. నిమ్మగడ్డ వ్యక్తిగత పట్టుదలకు, ఒక పార్టీ చేసిన కుట్రకు నిదర్శనమే ప్రస్తుత పరిస్థితి అని వ్యాఖ్యానించారు.

ministers-kannababu-and-peddireddy-react-on-supreme-court-verdict-over-ap-local-polls-2021
'నిమ్మగడ్డ పట్టుదల, ఒక పార్టీ కుట్రకు నిదర్శనమే ప్రస్తుత పరిస్థితి'

By

Published : Jan 25, 2021, 8:26 PM IST

ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యక్తిగత పట్టుదలకు, ఒక పార్టీ చేసిన కుట్రకు నిదర్శనమే ఈ పరిస్థితి అని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కె.కన్నబాబు వ్యాఖ్యానించారు. ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని మంత్రి ఆరోపించారు.

సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని... సర్వోన్నత న్యాయస్థానంపై గౌరవం ఉందని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పులోని అంశాలను పరిశీలించాకే తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి:కేంద్ర హోంశాఖ కార్యదర్శికి నిమ్మగడ్డ లేఖ

ABOUT THE AUTHOR

...view details