గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఈరోజు మాజీద్ గడ్డ జంగిల్ క్యాంపులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో భాగంగా... ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు సైతం గ్రీన్ ఛాలెంజ్‌ని పూర్తి చేసి... మరికొందరిని నామినేట్ చేశారు.
ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి ఆర్ శోభ గ్రీన్ ఛాలెంజ్ నిర్వహించారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో జంగిల్ క్యాంపు అర్బన్ ఫారెస్ట్ అడ్వంచర్ క్యాంపు ప్రారంభోత్సవంలో పాల్గొన్న అధికారులు ఆ తర్వాత అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు.
చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి ఇటీవల విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను అంగీకరించిన రాజేశ్వర్ తివారి మూడు మొక్కలు నాటి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును నామినేట్ చేశారు. ఇదే కార్యక్రమంలో అజయ్ మిశ్రా మొక్కలు నాటి రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ తీగల అనితా రెడ్డి, మహేశ్వరం ఎంపీపీ రఘుమారెడ్డి, హర్షగూడ సర్పంచ్ పాండు నాయక్‌ను నామినేట్ చేశారు.