తెలంగాణ

telangana

ETV Bharat / state

డబుల్​ బెడ్​రూం ఇళ్లు పంపిణీ చేయనున్న మంత్రులు - డబుల్​ బెడ్​రూం ఇళ్ల వార్తలు

నిరుపేదల సొంతిటి కల నెరవేర్చేందుకు హైదరాబాద్​ మహానగర పరిధిలో నిర్మించిన 264 రెండు పడక గదుల ఇళ్లను నేడు మంత్రులు ప్రారంభించనున్నారు. 20 కోట్లు వ్యయం ఈ ఇళ్లను నిర్మించారు.

డబుల్​ బెడ్​రూం ఇళ్లు పంపిణీ చేయనున్న మంత్రులు
డబుల్​ బెడ్​రూం ఇళ్లు పంపిణీ చేయనున్న మంత్రులు

By

Published : Jan 28, 2021, 8:33 PM IST

Updated : Jan 29, 2021, 4:09 AM IST

హైదరాబాద్ మహానగర పరిధిలో సుమారు 20 కోట్ల వ్యయంతో నిర్మించిన 264 డబుల్ బెడ్‌ రూం ఇళ్లను రాష్ట్ర మంత్రులు నేడు ప్రారంభించనున్నారు. గాంధీనగర్‌లో 15.50కోట్ల వ్యయంతో జీ ప్లస్ 3 అంతస్తుల్లో 200 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సాయిరాంనగర్​లో రూ.4.96 కోట్ల వ్యయంతో జి+3 అంతస్తుల్లో 64 డబుల్ బెడ్ రూం ఇళ్లను జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఇళ్లను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు కలిసి ప్రారంభించనున్నారు.

560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ డబుల్ బెడ్​రూం ఇళ్లలో ఒక లీవింగ్ రూమ్, రెండు బెడ్ రూమ్​లు, ఒక కిచెన్ రూమ్, రెండు టాయిలెట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి రూ.7.75 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా కేటాయించనున్నారు. ఈ ఇళ్ల కాలనీలో మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, లిఫ్ట్ సౌకర్యం, ఫైర్ సేఫ్టీ, సీసీ రోడ్లు, వీధి దీపాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. గతంలో పూర్తిగా మురికివాడలుగా ఉన్న గాంధీనగర్, సాయిరాం నగర్​లలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టడం వల్ల ఇక్కడి స్థానికులు ఉన్నత ప్రమాణాలతో కలిగిన గృహాల్లో నివసించనున్నారు.

ఇదీ చదవండి: ఉత్తర, దక్షిణ భారత్​కు వారధిగా హైదరాబాద్​: కేటీఆర్​

Last Updated : Jan 29, 2021, 4:09 AM IST

ABOUT THE AUTHOR

...view details