రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే మంత్రులు, ప్రముఖుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు లోబడి ఉత్సవాలు నిర్వహించాలని.. మంత్రులు, ప్రముఖులు అమరవీరులకు నివాళులు అర్పించి.. ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని వేదిక వద్ద 10 మందికి మించరాదని తెలిపింది.
Telangana Formation day: ఏ జిల్లాలో ఎవరు జెండా ఆవిష్కరిస్తారంటే? - telangana formation day latest news
తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాల్లో జాతీయ పతాకం ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లాల వారీగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే వారి పేర్లను తెలుపుతూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఎలాంటి ప్రసంగాలు, ప్రైజులు, ఆస్తుల పంపిణీ ఉండరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనుండగా.. జిల్లా కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు మంత్రులు, ప్రముఖులు పతాకావిష్కరణ చేయనున్నారు. జిల్లాల వారీగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే వారి పేర్లను ఖరారు చేస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- ఆదిలాబాద్-గంప గోవర్దన్, ప్రభుత్వ విప్
- భద్రాద్రి కొత్తగూడెం-రేగా కాంతారావు, ప్రభుత్వ విప్
- జగిత్యాల- కొప్పుల ఈశ్వర్, మంత్రి
- జయశంకర్ భూపాలపల్లి- భాను ప్రసాదరావు, ప్రభుత్వ విప్
- జనగామ- బోడకుంటి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీఫ్ విప్
- జోగులాంబ గద్వాల- గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్
- కామారెడ్డి- పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభాపతి
- ఖమ్మం- పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి
- కరీంనగర్- గంగుల కమలాకర్, మంత్రి
- కుమురం భీం ఆసిఫాబాద్- అరికెపూడి గాంధీ, ప్రభుత్వ విప్
- మహబూబ్‌నగర్- వి.శ్రీనివాస్ గౌడ్, మంత్రి
- మహబూబాబాద్- సత్యవతి రాఠోడ్, మంత్రి
- మంచిర్యాల- అనురాగ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు
- మెదక్- తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
- మేడ్చల్-మల్కాజిగిరి- చామకూర మల్లారెడ్డి, మంత్రి
- ములుగు- ఎం.ఎస్.ప్రభాకర్ రావు, ప్రభుత్వ విప్
- నాగర్‌కర్నూల్- కె.దామోదర్ రెడ్డి, ప్రభుత్వ విప్
- నల్గొండ- గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి ఛైర్మన్
- నారాయణపేట- నేతి విద్యాసాగర్, శాసనసభ ఉపసభాపతి
- నిర్మల్- ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి
- నిజామాబాద్- వి.ప్రశాంత్ రెడ్డి, మంత్రి
- పెద్దపల్లి- కె.వి.రమణాచారి. ప్రభుత్వ సలహాదారు
- రాజన్న సిరిసిల్ల - కె.టి.రామారావు, మంత్రి
- రంగారెడ్డి- సబితా ఇంద్రారెడ్డి, మంత్రి
- సంగారెడ్డి- మహమూద్ అలీ, మంత్రి
- సిద్దిపేట- టి.హరీశ్‌రావు, మంత్రి
- సూర్యాపేట- జి.జగదీశ్‌రెడ్డి, మంత్రి
- వికారాబాద్- టి. పద్మారావు గౌడ్, శాసనసభ ఉపసభాపతి
- వనపర్తి- ఎస్.నిరంజన్ రెడ్డి, మంత్రి
- వరంగల్ రూరల్- బి.వినోద్ కుమార్ , ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
- వరంగల్ అర్బన్ - దాస్యం వినయ్ భాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్
- యాదాద్రి భువనగిరి- గొంగిడి సునీత, ప్రభుత్వ విప్
- దిల్లీలోని తెలంగాణ భవన్- కె.ఎం.సాహ్ని, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి
ఇదీ చూడండి: Vaccination : జూన్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు టీకా