Ministers on Schools Development: పాఠశాలల అభివృద్ది కోసం చేపట్టిన మన ఊరు, మన బస్తీ- మన బడి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్ రావు కోరారు. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రులు ఆదేశించారు. కలెక్టర్లతో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. మొదటి దశలో గుర్తించిన 9,123 బడుల్లో పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రులు తెలిపారు. జిల్లా స్థాయిలో మూడు రకాల సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. మంత్రుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ల ఆధ్వర్యంలో జడ్పీటీసీ, ఎంపీపీ, గ్రంథాలయ ఛైర్మన్లు... పాఠశాల యాజమాన్య కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.
'పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలి'
Ministers on Schools Development: 'మన ఊరు, మన బస్తీ- మన బడి' కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్ రావు కోరారు. జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. ప్రతీ ఉన్నత పాఠశాలలో ఒక గ్రంథాలయం ఉండేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు.
ప్రతీ ఉన్నత పాఠశాలలో ఒక గ్రంథాలయం ఉండేలా చూడాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. నిధులకు ఎలాంటి కొరత లేదని.. ప్రత్యేక ఖాతాలు తెరిచి ఖర్చు చేయాలని మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అవసరం మేరకే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆ మేరకు ఖర్చు చేయాలని.. 15 రోజుల్లో అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలన్నారు. పూర్వ విద్యార్థులు, దాతల సహకారం కూడా తీసుకోవాలన్న మంత్రులు కోటి రూపాయలు విరాళంగా ఇస్తే ఆ పాఠశాలకు వారి పేరు పెట్టనున్నట్లు తెలిపారు. ఒకే ఆవరణలో జూనియర్ కళాశాలలు, అంగన్ వాడీలు ఉంటే వాటిని కూడా కలుపుకొని అభివృద్ధి చేయాలన్నారు.
ఇదీ చదవండి: