రాష్ట్రంలో ప్రబలుతున్న విషజ్వరాల తీవ్రత, రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి తెలుసుకునేందుకు మంత్రులు తలసాని, ఈటల సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. సీజనల్ వ్యాధుల పట్ల ఆస్పత్రిలో తీసుకుంటున్న చర్యలపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. వార్డులన్ని తిరిగి రోగులను పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి, అందుతున్న వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు. అనంతరం ఈటల రాజేందర్... నూతన సెమినార్ హాల్, లైబ్రరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని కూడా హాజరయ్యారు.
'వాతావరణంలో మార్పుల వల్లే వ్యాధుల విజృంభణ' - EETALA RAJENDER
వాతావరణంలో మార్పుల కారణంగానే వ్యాధులు వస్తున్నాయి. రోగులకు సరైన సేవలు అందించేందుకు వైద్యులు, ప్రభుత్వం పూర్తిగా కృషి చేస్తోంది. ఒకే పడక మీద ఇద్దరు రోగులా.. అంటూ ప్రచారం చేయడం సబబు కాదు. దేశవ్యాప్తంగా చూస్తే... తెలంగాణలోనే మెరుగైన వైద్య చికిత్సలందుతున్నాయి: తలసాని, మంత్రి
గాంధీ ఆస్పత్రిని సందర్శించిన మంత్రులు ఈటల, తలసాని