తెలంగాణ

telangana

ETV Bharat / state

Minister's assurance to farmers: కర్షకుల కన్నీటి గోస.. ఆదుకుంటామని మంత్రుల భరోసా

Minister's assurance to farmers who lost crops: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కళ్లాల్లో తడిసిన ప్రతి గింజా కొంటామని భరోసా కల్పించింది. దిగాలు చెందవద్దని.. ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలుస్తుందని తెలిపింది. ఆర్థికంగా కుంగిపోయిన కర్షకులను అక్కున చేర్చుకొని ఆసరా కల్పిస్తామంది. హాలికులెవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 26, 2023, 9:05 PM IST

అన్నదాతలను ఆదుకుంటామని మంత్రుల భరోసా

Minister's assurance to farmers who lost crops: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని.. ఆక్రోశిస్తున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి.. రైతులకు భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు.

రైతుల విషయంలో అత్యంత సానుకూలంగా ఉండే రైతు ప్రభుత్వం మనదని, అన్నదాతలు ధైర్యం కోల్పోవద్దని, వారికి అండగా కేసీఆర్ ఉన్నారని చెప్పారు. మరో రెండు రోజులు భారీ వర్ష సూచన ఉన్నందున.. అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని కేటీఆర్ సూచించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు మనోధైర్యంతో ఉండాలని.. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు భరోసానిచ్చారు.

సిద్దిపేట జిల్లాలో వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించారు. పంటపొలాలకు వెళ్లి, రైతులతో మాట్లాడిన హరీశ్‌.. నష్టం వివరాలపై ఆరా తీశారు. తినేముద్ద జారిపడినట్లుగా రైతుల పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. తడిసిన ప్రతిగింజా కొంటామని రైతులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వపరంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.


రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లతో పాటు జిల్లా అధికారులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పర్యవేక్షించారు. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే బాజిరెడ్డిగోవర్ధన్​రెడ్డి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. మెదక్‌ జిల్లాలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పంట పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ధైర్యం చెప్పారు. వరంగల్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ సూచన మేరకు ప్రతి గింజా కొనుగోలు చేస్తామన్నారు.

"అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాము. ప్రభుత్వపరంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించి.. తడిసిన ప్రతిగింజా కొంటామని రైతులకు హామీ ఇస్తున్నాము".- గంగుల కమలాకర్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details