తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎకో టూరిజంపై అభివృద్దిపై మంత్రుల సమీక్ష - eco tourism review telangana

రాష్ట్రంలో ఎకో టూరిజంపై మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ సమీక్షించారు. హైదరాబాద్ అరణ్యభవన్​లో పర్యటక, అటవీశాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం జరిపారు. పర్యటక ప్రాంతాల్లో సౌకర్యాలు, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Ministerial review on development on eco tourism in telangana
ఎకో టూరిజంపై అభివృద్దిపై మంత్రుల సమీక్ష

By

Published : Mar 27, 2021, 5:25 PM IST

రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని, జలాశయాల్లో పర్యాటకుల కోసం మ‌రిన్ని బోట్లు అందుబాటులోకి తీసుకురావాల‌ని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో పర్యటకం అభివృద్ధిపై హైదరాబాద్ అరణ్యభవన్​లో ఉన్నతస్థాయి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

అటవీశాఖ పరిధిలోని పర్యటక ప్రాంతాల్లో సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రులు అటవీ, ప‌ర్యట‌క‌ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఎకో టూరిజం అభివృద్ధిపై చర్చించారు. క‌వ్వాల్ జంగిల్ స‌ఫారీ, ల‌క్నవ‌రం, పాకాల చెరువు, బోగత జలపాతం, మ‌ల్లూర్ ట్రెక్కింగ్ పాత్​వేలు, ఫ‌ర్హాబాద్ ఎకో స‌ర్యూట్ పార్కుల‌ అభివృద్దిపై ప్రత్యేకంగా సమీక్షించారు.

టైగ‌ర్ రిజ‌ర్వ్ జోన్లు, వ‌న్యప్రాణుల సంర‌క్షణ కేంద్రాలు, శాంక్చూరీలు ఉన్న చోట అట‌వీ శాఖ అనుమ‌తులు తీసుకుని అభివృద్ది ప‌నులు చేయాల‌ని మంత్రులు అధికారులకు తెలిపారు. క‌డెం జలాశయంలో కొత్త బోట్లను ఏర్పాటు చేయాలని ఎమ్యెల్యే రేఖా శ్యాం నాయ‌క్ మంత్రుల‌ను కోర‌గా.. త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌కు మంత్రులు సూచించారు.

ఇదీ చూడండి :అమరవీరుల స్తూపం ముందు అధ్యాపకుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details