రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ఉపయోగించిన రెడ్ సాండ్ స్టోన్ నిర్మాణాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బృందం పరిశీలించింది. విజయ్ చౌక్‌లోని ఫౌంటైన్‌ను మంత్రి వేములతో పాటు అధికారులు పరిశీలించారు. అనంతరం దిల్లీ సౌత్ బ్లాక్‌స్టోన్‌ను సందర్శించారు. అధికారులను అడిగి మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరాలు తెలుసుకున్నారు.
పార్లమెంట్ భవనం రెడ్‌స్టోన్‌ను పరిశీలించిన ప్రశాంత్‌రెడ్డి - Telangana news
పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ పరిసరాలల్లోని నిర్మాణాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బృందం పరిశీలించింది. సౌత్, నార్త్ బ్లాక్ నిర్మాణానికి ఉపయోగించిన ఎరుపు, తెలుపు రాతిని పరిశీలించి.. అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో మంత్రి వేముల బృందం
సచివాలయ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. సచివాలయ నూతన భవనానికి రాజస్థాన్ రాళ్లతో సొగసులు, ధోల్పూర్ రాతితో నగిషీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇది వరకే నిర్ణయించింది. భవనం ముందు వైపున కిందిభాగంలో కొంత, పైభాగంలో కొంతమేర ఎరుపు రంగు రాతి పలకలను వినియోగించనున్నారు.
ఇదీ చూడండి:పాడి పరిశ్రమపై చిన్నచూపు ఎందుకు..?: ఎంపీ కోమటిరెడ్డి