తెలంగాణ

telangana

ETV Bharat / state

'8న బడ్జెట్​... 20న ద్రవ్య వినిమయ బిల్లు' - telangana budget 2020

రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సమాధానం ఉంటుందని మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 8న బడ్జెట్​ ప్రవేశపెడతామని తెలిపారు. 9, 10, 15 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించినట్లు చెప్పారు.

minister-vemula-prashanth-reddy-talk-about-assembly-meetings
రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు.. 8న బడ్జెట్​: మంత్రి వేముల

By

Published : Mar 6, 2020, 3:33 PM IST

ఈనెల 8న ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెడతామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద చర్చ ఉంటుందన్నారు. ఈనెల 9, 10, 15 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ఉంటుందని... 13, 14, 16, 17, 18, 19 తేదీల్లో పద్దులపై చర్చ జరుగుతుందని తెలిపారు. 20న ద్రవ్య వినిమయ బిల్లు పెడతామని చెప్పారు. అక్బరుద్దీన్, భట్టి విక్రమార్క లఘు చర్చలు పెట్టాలని కోరారని... సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని మంత్రి వేముల చెప్పారు.

లఘు చర్చల కోసం వచ్చిన సంఖ్యను బట్టి 20వ తేదీ తర్వాత మరోసారి బీఏసీ సమావేశమై... ఎన్నిరోజులు పొడిగించాలనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్​పై అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాత తీర్మానం చేస్తామని... కొన్ని బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెడతామని ప్రశాంత్​రెడ్డి వెల్లడించారు.

రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు.. 8న బడ్జెట్​: మంత్రి వేముల

ఇదీ చూడండి:బీఏసీ భేటీ... ఈనెల 20 వరకూ అసెంబ్లీ సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details